ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసింది. శనివారం కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కస్టడీ పొడిగించాలని మరోసారి కోర్టును కోరారు. అయితే ఆమె కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో కోర్టులో హాజరుపర్చిన అధికారులు.. మరో 3 రోజులు కస్టడీకి ఇవ్వాలని జడ్జిని కోరారు. దీంతో జడ్జి నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో విచారణ అనంతరం కవిత మాట్లాడుతూ.. ఏడాది కిందట అడిగిన విషయాలనే మళ్లీ అడిగారని అన్నారు. ఇది అక్షరాల అక్రమ అరెస్ట్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అరెస్ట్‌పై తాను న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. కాగా అంతకుముందు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పీఎంఎల్‌ఏ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు నియంత్రణలోకి రావడం లేదని, ఈడీ అధికారులు వైద్య పరీక్షలు నివేదికలు అందించడం లేదని పిటిషన్‌లో తెలిపారు. వైద్య పరీక్షలు నివేదికలిచ్చేలా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానంలో కవిత పిటిషన్ దాఖలు చేశారు. మెడికల్ రికార్డ్స్ రిపోర్ట్స్ అందించాలంటూ ఎమ్మెల్సీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.