ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మూడు రోజుల ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో అధికారులు ఆమెను రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. కోర్టుకు వెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కీలక కామెంట్స్ చేశారు. ఇది మనీలాండరింగ్ కేసు కాదని.. పొలిటికల్ లాండరింగ్ కేసని ఆమె అన్నారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఒక నిందితుడి ఇప్పటికే బీజేపీలో చేరాడు.. మరో నిందితుడికి ఆ పార్టీ టికెట్ ఇచ్చిందని ఆరోపించారు. మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి రూ.50 కోట్లు ఇచ్చాడని ఆమె కీలక కామెంట్స్ చేశారు. నేను క్లీన్ గా బయటకు వస్తా.. అప్రూవర్‌గా మారనని కవిత తెలిపారు.