Trending Now

ఏపీ మాజీ సీఎం జగన్‌ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత..

ప్రతిపక్షం, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. రేవంత్ సర్కార్ ఊహించని ఝలక్ ఇచ్చింది. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జగన్ ఇంటి ముందు ఉన్న అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కొరడా ఝలిపించింది. జగన్ ఇంటిముందు ఉన్న అక్రమ నిర్మాణాలను ఒక్కొక్కటిగా అధికారులు కూల్చివేస్తున్నారు. గతంలో జగన్ భద్రత కోసం రోడ్డును ఆక్రమించి మరీ గదులను సిబ్బంది నిర్మించడం జరిగింది. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగిస్తున్నారు.

అసలేం జరిగింది..?

రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై జీహెచ్ఎంసీ అధికారులకు సామాన్య ప్రజలు, వాహనదారులు ఫిర్యాదులు చేశారు. ఈ వరుస ఫిర్యాదులో రంగంలోకి దిగిన అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. కాగా.. పోలీస్ బందోబస్తు మధ్య జగన్ ఇంటి ముందు నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మొత్తానికి చూస్తే.. అక్రమ నిర్మాణాలు ఎక్కడ కనిపించినా సరే ఉపేక్షించేది లేదని.. రేవంత్ సర్కార్ స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చినట్లయ్యింది.

Spread the love

Related News

Latest News