Trending Now

Devara: రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తున్న ‘దేవర’

Devara’ creating records before its release: ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘దేవర’. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మూవీ ట్రైలర్ విడుదల కానుంది. ఇప్పటికే పాటలతో పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ఓవర్సీస్‌లో దీని ప్రీసేల్‌ టికెట్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో టికెట్స్ హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇది రిలీజ్ కావడానికి ముందే ఓవర్సీస్‌లో ప్రీసేల్‌ బుకింగ్‌తో మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరుకుంది. దీంతో నార్త్‌ అమెరికన్‌ బాక్సాఫీస్‌లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్‌ ద్వారానే వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరిన సినిమాగా ‘దేవర’ నిలిచింది. అంతేకాదు, ట్రైలర్‌ కూడా రిలీజ్ కాకముందే ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది.

Spread the love

Related News

Latest News