Trending Now

Devara: ‘దేవర’ సినిమాకు ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

What is NTR’s remuneration for the movie ‘Devara’?: జూ. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో వచ్చిన ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. రూ. 300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించగా ప్రపంచ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే రూ. 172 కోట్ల వసూళ్లు సాధించింది. ఇక, ఈ సినిమాలో నటీనటుల రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేశారట. ఆ సినిమాకు రూ. 45 కోట్లు తీసుకుంటే.. ‘దేవర’ సినిమాకు ఎన్టీఆర్ ఏకంగా రూ.60 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇక సైఫ్ అలీ ఖాన్ రూ. 10 కోట్లు, జాన్వీ కపూర్ రూ. 5 కోట్లు, ప్రకాష్ రాజ్ రూ. 1.5 కోట్లు, శ్రీకాంత్ రూ. 50 లక్షలు, మురళీ శర్మ, నరైన్‌లు రూ. 40 లక్షలు తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది.

Spread the love

Related News

Latest News