ప్రతిపక్షం, జూలై 25: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రముఖ నటి జ్యోతిక డిమాండ్ చేశారు. విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది.
ఇన్స్టాగ్రామ్లో స్పందించిన జ్యోతిక, “నేను విద్యార్థులు, దేశ భవిష్యత్ తరఫున నిలబడతాను. తల్లులుగా మన పిల్లలను సోనమ్ వాంగ్చుక్, అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్లా ధైర్యంగా, బాధ్యతతో ఎదిగేలా తీర్చిదిద్దాలి. పోరాటం చేస్తున్న Gen Z యువతపై గర్వంగా ఉంది” అని పేర్కొన్నారు.
అలాగే, “భయపడకుండా ఉద్యమం చేస్తున్న CJP సభ్యులకు ధన్యవాదాలు. దేశ యువతకు న్యాయం జరగాలి. ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలి” అంటూ ఆమె డిమాండ్ చేశారు.
జ్యోతిక చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. కొందరు ఆమె అభిప్రాయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

















