Trending Now

Director Vamsee Krishna: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు

Tiger nageswara rao Director Vamsee Krishna got Married: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వంశీ కృష్ణ ఓ ఇంటి వాడయ్యాడు. బుధవారం జరిగిన ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ తోపాటు పలువురు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వంశీ కృష్ణ పెళ్లికి సంబంధించిన పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇటీవల వంశీ కృష్ణ..రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. 1970లో స్టూవర్టుపురంలో పేరు ఉన్న ఓ గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితంలోని కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని పాన్ ఇండడియా లెవల్‌లో తెరకెక్కించారు.

Spread the love

Related News

Latest News