ప్రతిపక్షం, స్టేట్ బ్యూరో, నవంబర్ 20:
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో లో రేషన్ షాపుల ద్వారా వినియోగదారులకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వివరించారు. ప్రజలు తినే బియ్యాన్ని ఇస్తేనే సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేసే అంశాన్ని పటిశీలించాలని కేంద్ర మంత్రికి ఆయన సూచించారు. అవసరమైతే దీనిపై అధ్యయనం చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. పూర్తిస్థాయి అధ్యయనం తరువాత పరిశీలించి దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.
హోటల్ తాజ్ కృష్ణలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం బ్రేక్ ఫాస్ట్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ మీటింగ్కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్టీఫెన్ రవీంద్ర, ఉన్నతాధికారులు హాజరయ్యారు.



























