Trending Now

ఎన్నికల విధులపై పరిపూర్ణమైన అవగాహన అవసరం

నిర్మల్ జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ‌మే 1: ఎన్నికల విధులుపై పూర్తి అవగాహనా కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని సెయింట్ థామస్ పాఠశాలలో ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు రెండో విడత ఎన్నికల అవగాహన శిక్షణ సదస్సు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే అధికారులు పూర్తి అవగాహనా కలిగి ఉండాలని, ఎన్నికలకు ఒక రోజు ముందే సమయానికి ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రదేశాలకు చేరుకొని సంబంధిత సామాగ్రిని తీసుకొని సూర్యాస్తమయం లోపు తమకు కేటాయించిన ఎన్నికల కేంద్రాలకు చేరుకోవాలని ఆదేశించారు. పోలింగ్ రోజు ఉదయం 5:30 కు అన్ని రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో 50 ఓట్లకు మాక్ పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత సి ఆర్ సీ ప్రక్రియ చేయాలని తెలిపారు. మాక్ పోలింగ్‌లో నమోదైన వీవీ ప్యాట్ స్లిప్పులను సంబంధిత కవర్లలో భద్రపరచాలని సూచించారు.

ప్రతి రెండు గంటలకు ఓటింగ్ శాతానికి సంబంధించిన వివరాలను వారి వారి సెక్టార్ ఆఫీసర్లకు అందజేయాలని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన 17 సీ ఫారం, పీఓ డైరీ, తదితర రిజిస్టర్‌లను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈవీఎంల పనితీరును పరిశీలించి వాటిలో ఏవైనా సమస్యలు తలెత్తినట్టయితే పై అధికారుల ఆదేశానుసారం మాత్రమే ఈవీఎం సెట్లను మార్చాలని తెలిపారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత జాగ్రత్తగా రిసెప్షన్ కేంద్రాలలో ఈవీఎం యంత్రాలను అందించాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మాస్టర్ ట్రైనర్లను అడిగి తెలుసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ చేయాలన్నారు. అనంతరం పలువురు మాస్టర్ ట్రైనర్లు అధికారులకు ఎన్నికల విధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఈవో రవీందర్ రెడ్డి, ఆర్డీఓ రత్నకళ్యాణి, మాస్టర్ ట్రైనర్లు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News