Trending Now

నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పూర్తి చేయండి..

నిర్మల్ జిల్లా కలెక్టర్ అశీష్ సాంగ్వాన్

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 21 : నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక ఎన్‌టీఆర్ స్టేడియం సమీపంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో చేపట్టిన పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనులను నాణ్యత ప్రమాణాలు పాటించి బడుల పునః ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్, త్రాగునీరు, మరుగుదొడ్లకు నీటి సరఫరా, స్లాబ్, ప్రహరీ గోడల నిర్మాణం, మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు. మహిళా సంఘాలు, విద్యాశాఖ అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

అనంతరం సోఫీనగర్ లోని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన, జిల్లా కేంద్రం నుండి మండలాలకు సరఫరా కానున్న ఏకరూప దుస్తుల పంపిణీ ని కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలోని 52264 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టిస్కొ ద్వారా ఒక జత ఏకరూప దుస్తుల వస్త్రం దాదాపు 1,12, 600 మీటర్లు జిల్లా కేంద్రానికి చేరిందని తెలిపారు. మండలాల వారీగా ఏకరూప దుస్తుల వస్త్రాన్ని అందించడం జరుగుతుందని, మండల ఎంఈఓ లు, నోడల్ అధికారులు, ఏపీఎంల ఆధ్వర్యంలో స్వయం సహాయ సంఘాల గ్రూపుల ద్వారా జూన్ 5వ తేదీ లోపు విద్యార్థులందరికీ ఒక జత ఏకరూప దుస్తులు అందేలా చర్యలుతీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే పాఠశాలలో చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల పనులను కలెక్టర్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేసారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన..

నిర్మల్ జిల్లా నిర్మల్ మండలంలోని మంజూలాపూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, ధాన్యం కొనుగోళ్లను నిరంతరం చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, టెంట్, వంటి వసతులు కల్పించాలని సూచించారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అవసరమైన గన్నీ బ్యాగ్స్, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అన్నారు.

రోజువారీ ధాన్యం వివరాలను ట్యాబ్ ఎంట్రీ చేయాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమాలలో డి ఈ ఓ రవీందర్ రెడ్డి, చేనేత శాఖ ఏడి రమ్య, సీఎంఓ ప్రవీణ్, సివిల్ సప్లయిస్ డీఎం శ్రీకళ, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News