ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మహాశివుడి ఆశీస్సులతో మరోసారి నరేంద్ర మోదీ దేశ ప్రధాని కావడం ఖాయయమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం షాద్ నగర్ నియోజక వర్గంలోని రామేశ్వరంలో స్వయంభూగా వెలిసిన శ్రీరామలింగేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా డీకే అరుణ మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా ఆశీస్సులు అందజేయాలని ఆ రామలింగేశ్వర స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. ఆ శివయ్య ఆశీస్సులతో తెలంగాణలో 12 స్థానాల్లో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం డీకే అరుణను ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు సన్మానించిన తీర్థ ప్రసాదాలు అందజేశారు.