Trending Now

నవగ్రహాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్న శునకం..

ప్రతిపక్షం, ప్రతినిధి సిరిసిల్ల జిల్లా, జూన్ 07: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. గురువారం శని జయంతి సందర్భంగా గ్రామంలోని గీత మందిరంలో ఉన్న నవ గ్రహాల వద్ద ఓ శుకనం 11 ప్రదక్షిణలు చేయడం అందరిని ఆశ్చర్య పరిచింది. మాములుగా అయితే శని జయంతి సందర్భంగా భక్తులు ఆలయంలోని నవ గ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం మాములే కానీ ఒక శునకం ఇలా నవ గ్రహాల చుట్టూ తిరగడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తుంది. ఇది కాస్త అక్కడున్న వారు వీడియో తీసి పోస్ట్ చేయగా.. సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది.

Spread the love

Related News