Donald Trump Social Media Post Viral: అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతిపరులను జైలుకు పంపిస్తామని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఎన్నికల సమయంలో అవినీతికి పాల్పడే వారిని ఉద్దేశించి ఈ పోస్టు చేశారు. తాను అధికార పీఠమెక్కిన వెంటనే అవినీతిపరులందరినీ జైలుకు పంపిస్తామని వెల్లడించారు.
అలాగే తమ ప్రభుత్వం వారికి కఠిన శిక్ష అమలు చేస్తుందన్నారు. ఓటింగ్‌లో అవినీతికి పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. న్యాయవాదులు, రాజకీయ నాయకులు, దాతలు, అక్రమ ఓటర్లు, అధికారులందరికీ వర్తిస్తుందన్నారు. ఓటింగ్ లో అవినీతికి పాల్పడితే ఎప్పుడూ లేనివిధంగా చర్యలు ఉంటాయని, దీర్ఘకాల జైలు శిక్షలు ఉంటాయని హెచ్చరించచారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.