ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 24 : ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులందరికీ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి డా. ఈసవేని మనోజ్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. ఫెయిలైన విద్యార్థులెవరు ఆధైర్య పడవద్దని.. నిరాశకు లోనై క్షణికావేశంలో ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని పేర్కొన్నారు. పరీక్ష తప్పినంత మాత్రాన జీవితం కోల్పోయినట్టు కాదని.. కొత్త అవకాశాలను సృష్టించుకుని పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు మనోధైర్యాన్ని ఇవ్వాలన్నారు. దేశ భవిష్యత్తు నిర్మాణంలో విద్యార్థులు యువతదే కీలకపాత్ర అని చిన్న, చిన్న కారణాలతో వారు జీవితాన్ని చాలించి తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలించడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన జీవితంలో విజయం సాధించిన వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు.