పోలీస్ కమిషనర్ బి. అనురాధ
ప్రతిపక్షం, సిద్దిపేట, జూన్ 15: సిద్దిపేట జిల్లాలోనీ వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకొని బలవంతంగా స్కూల్స్ బంద్ చేయించడం స్కూల్‌లో వద్దకు వెళ్లి పిల్లలకు ఇబ్బంది కలిగించడం వంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని పోలీస్ కమిషనర్ అనురాధ సూచించారు. స్కూల్ పిల్లల తరఫున ఏవైనా సమస్యలు ఉంటే విద్యార్థి సంఘాల నాయకులు, డీఈఓ లేదా, సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులకు, లేదా కలెక్టర్‌ని కలసి రిప్రజెంటేషన్ ఇవ్వాలని వారు ఆ సమస్యలపై స్కూల్లో యాజమాన్యాలతో మాట్లాడి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని స్కూల్‌లో ముందు ధర్నాలు రాస్తారోకోలు చేసి స్కూల్ పిల్లలకు ఇబ్బంది కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు.