Trending Now

‘నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు’.. మోహన్ బాబు వార్నింగ్

ప్రతిపక్షం, సినిమా: తన పేరును కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ లేఖను రిలీజ్ చేశారు. ఈ మధ్య కాలంలో తన పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు. దయచేసి ఏ పార్టీ వారైనా తన పేరును వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వారి వ్యక్తిగతం.. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే మనం దృష్టి పెట్టాలిగాని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరమన్నారు మోహన్ బాబు. ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నానని మోహన్ బాబు లేఖలో తెలిపారు.

Spread the love

Related News

Latest News