ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కాలంగా ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న రామ్ పోతినేని ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు పూరి. డబుల్ ఇస్మార్ట్ కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. టీజర్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది.