మిస్సెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఫైనల్స్‌కు నిర్మల్ డాక్టర్ చంద్రిక..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 22 : నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన స్త్రీ వైద్య నిపుణులు చంద్రిక అవినాష్ మిస్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఫైనల్స్ కు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో శనివారం తెలంగాణ రాష్ట్రం నుంచి డా. చంద్రిక ఫైనల్ స్కోర్ అర్హత సాధించారు. అయితే వచ్చేనెల అనగా మే 28 నుంచి జూన్ 1 వరకు గుర్గావ్ ఢిల్లీలో జరిగే ఫైనల్ పోటీలలో పాల్గొంటారు. ఈ ఘనతను సాధించిన డాక్టర్ చంద్రికను నిర్మల్‌కు చెందిన పలువురు ప్రముఖులు, వైద్యులు, రాజకీయ నాయకులు అభినందనలు తెలిపారు. నిర్మల్‌లో ఆమె ప్రస్తుతం గైనకాలజిస్ట్‌గా సేవలందిస్తున్నారు.

Spread the love

Related News