ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతోందని.. ఎలాంటి కార్యక్రమం అయినా ‘సువిధ’ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖేశ్ కుమార్ మీనా ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ ఎక్సామ్ నిర్వహణపై ప్రకటన చేశారు. డీఎస్సీ వాయిదా వేయాలని వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చాయని.. ’’డీఎస్సీ నియామకంపై ఎన్నికల కమిషన్‌కు పంపిస్తున్నాం. ఈసీ నుంచి అనుమతి వస్తేనే డీఎస్సీ పరీక్ష జరుగుతుంది’’ అని స్పష్టం చేశారు.