Trending Now

చిట్యాల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన డీఎస్‌ఓ..

జిల్లాలో 370 సెంటర్స్ ద్వారా వరి ధాన్యం కొనుగోలు..

ప్రతిపక్షం, నకిరేకల్, ఏప్రిల్ 12: చిట్యాల పట్టణంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం సందర్శించారు. రైతులు ధాన్యాన్ని తెచ్చిన వెంటనే పేరు నమోదు చేసుకుని వరుస క్రమంలో త్వరితగతిన కొనుగోలు జరపాలని ఆదేశించారు. వర్షం వచ్చే సూచనలు ఉన్నందున రైతులు ధాన్యం తడవకుండా అందుబాటులో ఉంచిన తార్పాలిన్ల తో కప్పి ఉంచాలని సూచించారు. జిల్లాలో 370 సెంటర్స్ ద్వారా వరి ధాన్యం కొనుగోలు జరుగుతుందని.. ఇప్పటివరకు 889 మంది రైతుల నుండి 63500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపడం జరిగిందని వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి గాను 12 కోట్ల 66 లక్షల రూపాయలను రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగిందని అన్నారు. ఆయన వెంట లింగస్వామి చిట్యాల పిఎసిఎస్ సీఈవో బ్రహ్మచారి, కొనుగోలు కేంద్రం ఇన్చార్జి నాగరాజు, ఇతర సిబ్బంది ఉన్నారు.

Spread the love

Related News

Latest News