ప్రతి పక్షం, దుబ్బాక, మే 7: ఈనెల 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ స్టేషన్లో పోలింగ్ అధికారులకు వసతుల ఏర్పాటుకు పంచాయతీ కార్యదర్శులు అన్ని ఏర్పాట్లు చేయాలని దుబ్బాక ఏఆర్ఓ, జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. మంగళవారం దుబ్బాక ఐఓసీ కార్యాలయంలో దుబ్బాక నియోజకవర్గ పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గరిమా అగర్వాల్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో అత్యంత ముఖ్యమైన పోలింగ్ డే అని పోలింగ్ డే రోజు అందరూ కూడా అత్యంత బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు నిర్వహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో కరెంట్, ఫ్యాన్ టా యిలెట్స్ చల్లటి నీళ్లు వంటి వసతులను తప్పక కల్పించాలన్నారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ కి ఇద్దరు వాలెంటైర్స్, వీల్ చైర్ వసతిని తప్పక కల్పించాలన్నారు. పోలింగ్ అధికారులకు పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు భోజనం వసతి ని తప్పక ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ దేవకి దేవి, డీఎల్ పీఓ మల్లికార్జున్, ఏ ఏఆర్ఓ వెంకటారెడ్డి తదితరులున్నారు.