Trending Now

అయోధ్య బాలరాముడి అలంకరణకు దుబ్బాక చేనేత వస్త్రం

ప్రతిపక్షం, దుబ్బాక, మే 29: సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత వస్త్ర ఖ్యాతి దేశం నలుమూలల విస్తరించింది. నూతన వస్త్ర డిజైన్లకు అనుగుణంగా తయారుచేస్తూ.. దుబ్బాక చేనేత కార్మికులు ప్రశంసలు పొందుతున్నారు. సాక్షాత్తు అయోధ్య బాల రాముడి కి దుబ్బాక చేనేత వస్త్రాన్ని ధరించి మరింత ఖ్యాతిని విస్తరింపజేశారు. వారం రోజుల పాటు రోజుకో రంగుతో తయారైన వస్త్రాన్ని బాల రాముడికి అలంకరించేందుకు అర్డర్‌ను అందుకున్నారు. దుబ్బాకలో ఏర్పా టైన దుబ్బాక హైండ్ల్యూ మ్స్ కంపెనీలో తయారైన లినెన్ ఇక్కత్ చేనేత వస్త్రాన్ని (పింక్ కలర్) ఆదివారం ఆయోధ్య రాముడికి అలంకరించి ప్రశంసలు అందుకు న్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బోడ శ్రీని వాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయోధ్య రాముడి అలంకరణకు తాము తయారు చేస్తున్న లెనిన్ వస్త్రాలు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు.

ప్రతి సోమవారం నుంచి ఆదివారం వరకు వివిధ రంగులతో తయారు చేసిన వస్త్రాలను బాల రాముడికి అలంకరించేందుకు ఢిల్లీకి చెందిన డిజైనర్ మనీశ్తోత్రిపాఠి ఎంపిక చేస్తారని ఈ క్రమంలో దుబ్బాకలో తయారైన లెనిన్ చేనేత వస్త్రం డిజైన్లు నచ్చి తమ కంపెనీకి అర్డర్ ఇచ్చారని శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం రెండు రంగులతో కూడిన రెండు డిజైన్ లె నిన్ ఇక్కత్ వస్రా లను అందించడం జరిగిందన్నారు. ప్రతి వస్త్రం 12 మీటర్ల పొడవు ఉంటుంద న్నారు. ఆదివారం బాల రాముడికి పింక్ కలర్ వస్త్రాన్ని అలంకరణ చేసే నిబంధన ఉండటంతో తాము తయారు చేసిన పింక్ కలర్ వస్త్రాన్ని రాము డికి అలంకరించినట్లు డిజై నర్తో పాటు ఆలయ కమిటీ సభ్యులు సమాచారం అందించారన్నారు. మరో ఐదు రోజు లకు ఐదు డిజైన్లతో కూడిన వస్త్రాలను తయారు చేసి అందజేయనున్నట్లు చైర్మన్ బోడ శ్రీనివాస్ తెలిపారు. గత ఫిబ్రవరిలో ఢిల్లీలో జాతీయ స్థాయిలో కేంద్ర చేనేత, జౌళీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విరాసత్ పేరిట చేనేత చీరల ప్రదర్శనలో దుబ్బాకలో తయారైన లినెన్ చీరకు స్థానం దక్కి దుబ్బాక చేనేత కార్మికులు ప్రశంసలు పొందటం దుబ్బాక గడ్డకు గర్వకారణమన్నారు.

Spread the love

Related News

Latest News