Trending Now

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్..

ట్రేస్ చేసి బాధితులకు ఇచ్చిన పోలీసులు..

ప్రతి పక్షం, దుబ్బాక, ఏప్రిల్15: పోగొట్టుకున్న ఫోన్ సీఈఐఆర్ టెక్నాలజీ సహాయంతో పట్టుకుని బాధితునికి అప్పగించినట్లు దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ.. అజీమెర మహేష్, గ్రామం శిలాజి నగర్, బిట్ల బాలమణి భర్త బాబు, గ్రామం పెద్ద గుండవెల్లి, గత కొన్ని రోజుల క్రితం ఇరువురు ఫోన్లు పోగొట్టుకున్నారు. మొబైల్ పోయిన వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన www.ceir.gov.in అనే వెబ్‌సైట్ ఫోన్ యొక్క ఐఎంఈఐ నెంబర్ ను ఎంటర్ చేసి, బ్లాక్ చేయడం జరిగింది. ఫోన్స్ దొరికిన వ్యక్తి దానిలో సిమ్ కార్డు వేసుకోవడంతో, ఈ వెబ్‌సైట్ ద్వారా అతని వివరాలతో కూడిన సమాచారం రాగానే ఫోన్ దొరికిన వ్యక్తుల వద్ద నుండి ఫోన్స్ స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశారు.

ఎవరైతే ఫోన్ పోగొట్టుకుంటే, గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనంగా ఎత్తుకొని పోయిన వారు వెంటనే కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్) పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని, తద్వారా కోల్పోయిన ఫోన్ను తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ పోర్టల్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Spread the love

Related News

Latest News