Trending Now

Duleep Trophy: అనంతపురం వేదికగా దులీప్ ట్రోఫీ షురూ..

అనంతపురం వేదికగా దేశవాళీ క్రికెట్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ ఇవాళ ప్రారంభమైంది. తొలి రౌండ్‌ మ్యాచ్‌లో అనంతపురంలో ఇండియా-డితో ఇండియా-సి తలపడుతోంది. బెంగళూరులో ఇండియా-ఎతో ఇండియా-బి పోటీ పడుతోంది. ఇండియా-ఎ (కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌) టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఇండియా-బి(కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌)ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మరోవైపు ఇండియా-సి(కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌) టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఇండియా-డి(కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌)ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు మినహా మిగిలిన స్టార్ ఆటగాళ్లందరూ బరిలోకి దిగుతున్నారు. ఈ సారి నాలుగు జట్లతో ఈ టోర్నీ జరగనుంది. ఏ జట్టులో ఎవరున్నారో చూద్దాం.

ఏ జట్టులో ఎవరున్నారంటే?

ఇండియా ఎ: శుభ్‌మన్‌ గిల్ (కెప్టెన్), మయాంక్‌ అగర్వాల్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, తనుష్ కొటియన్, కుల్‌దీప్‌ యాదవ్, ఆకాశ్‌ దీప్, అవేశ్‌ ఖాన్, ఖలీల్ అహ్మద్

ఇండియా బి: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీశ్‌ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవిశ్రీనివాసన్ సాయి కిశోర్, ముకేశ్‌ కుమార్, నవ్‌దీప్‌ సైని, యశ్ దయాల్

ఇండియా సి: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటీదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), బాబా ఇంద్రజీత్, ఆర్యన్ జుయెల్, హృతిక్ షోకీన్, విజయ్‌ కుమార్ వైశాక్, మానవ్ సుతార్, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహాన్

ఇండియా డి: దేవదుతు పడిక్కల్, యశ్ దూబె, రికీ భుయ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శ్రీకర్ భరత్, అథర్వ తైడే (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, శరన్ష్‌ జైన్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఆదిత్య థాకరె

Spread the love

Related News

Latest News