ప్రతిపక్షం, వెబ్ డెస్క్: వైద్య శాస్త్రంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. చికిత్స లేని HIV ఎయిడ్స్‌కు డచ్ సైంటిస్టులు తాజాగా పరిష్కారాన్ని కనుగొన్నారు. శరీరంలో కణాల నుంచి CRISPR (క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్‌స్పేటెడ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్) సాంకేతికతతో HIVని తొలగించే వీలుందని తేల్చారు. వైరస్ సోకిన జన్యువులను గుర్తించి, జీన్ ఎడిటింగ్ టెక్నాలజీతో కత్తిరిస్తారు. దీర్ఘ కాలంలో HIVకి ఈ చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయని, ఇప్పటికిప్పుడు కాకపోయినా దీర్ఘకాలంలో HIVకి చికిత్స సాధ్యమవుతుందని పరిశోధకులు తెలిపారు.