ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే పెన్షన్ల పంపిణీపై పరిమితులు విధించగా.. తాజాగా రేషన్ పంపిణీలోనూ వాలంటీర్లు పాల్గొనవద్దని ఆదేశించింది. వాలంటీర్ల స్థానంలో వీఆర్వోలు మ్యాపింగ్ చేయాలని సూచించింది. ఎండీయూ ఆపరేటర్లు కూడా వాలంటీర్లను రేషన్ పంపిణీకి పిలవకూడదని స్పష్టం చేసింది. ఇవాళ్టి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రాగా.. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది.