Trending Now

ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తుంది. ఈడీ అధికారులతో కలిసి ఐటీ సోదాలు చేపట్టింది. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఏడాదిన్నరగా ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ జరుగుతుంది. అందులో భాగంగానే.. ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. ఇప్పటికే కీలక నిందితులంతా అఫ్రూవల్ గా మారారు. కవిత ఢిల్లీ పీఏ సైతం అఫ్రూవల్ గా మారాడు. పీఏ అశోక్ కౌశిక్ అఫ్రూవల్ గా మారడంతో కేసు కీలక మలుపు తిరిగింది. ఈ క్రమంలో.. కవిత నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.

Spread the love

Related News

Latest News