ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌తో పాటు.. పలుచోట్ల తనిఖీలు చేపడుతున్నారు. కవిత ఆడపడుచు అఖిల నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ విచారించింది.