ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TS GENCO) కీలక ప్రకటన చేసింది. ఈ నెల 31న జరుగాల్సిన ఏఈ మరియు కెమిస్ట్ ఉద్యోగ నియామకాల పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.