Trending Now

ఎంపీటీసీ మహేష్ చొరవతో తీరిన విద్యుత్ కష్టాలు..

ప్రతిపక్షం, మంథని, మే 29 : రామగిరి మండలంలోని పన్నుర్ ఎంపీటీసీ చిందం మహేష్ చొరవతో పన్నుర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వకిల్ పల్లి ప్లాట్స్‌లో లో-ఓల్టేజ్ విద్యుత్ సరఫరా సమస్యలు తీరయని ఆ గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా లో-ఓల్టేజ్ విద్యుత్ సరఫరా సమస్యతో బాధపడుతున్న విషయాన్ని గ్రామ ప్రజల ద్వారా తెలుసుకున్న ఎంపీటీసీ చిందం మహేష్.. రామగిరి విద్యుత్ ఏఈ మహేందర్ రెడ్డి తో మాట్లాడి 3 నూతన ట్రాన్స్ఫార్మర్స్ ని వకిల్ పల్లి ప్లాట్స్ లో భిగించి లో-ఓల్టేజ్ విద్యుత్ సమస్యను పరిష్కరింపజేశారు.

Spread the love

Related News

Latest News