ఈద్గాం చౌరస్తాలో సగం వెలుగులతోనే సరిపోతున్న విద్యుత్ సరఫరా
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 15 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ చౌరస్తా అయినా ఈద్గాం చౌరస్తాలో ఏడాదికాలంగా అంధకారం నెలుకొని ఉంటుంది. ప్రతిరోజు వేలాది భారీ సాధారణ వాహనాలు పాదాచారుల రాకపోకలు సాగే ఈ చౌరస్తాలో రాత్రి సమయం కాగానే అంధాకారం ఉంటుంది. రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ పట్టణ సుందరీకరణ పనులలో భాగంగా లక్షలాది రూపాయలు వెచ్చించి హైమస్ట్ విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. సదరు స్తంభంపై పదికి పైగా భారీ ఎల్ఈడి లైట్లు ఉండగా ఏడాదికాలంగా అందులో నుండి రెండు కూడా సరిగా వెలుగాక పోగా వస్తూ.. పోతూ ఉంటాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని నాందేడ్, బైంసా అదే మాదిరి పరిసర గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు ఇటు గుండనే వెళ్తున్నాయి. దీనికి తోడు సదరు ప్రాంతంలో రోడ్లపై గోతులు ఏర్పడి నడవడం నరకంగా ఉండడంతో రాత్రి సమయాలలో ద్విచక్ర వాహనాల వారు ఏమి కనిపించక గోతులలో వాహనాలు దిగిపోయి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ విషయమై పలుమార్లు నిర్మల్ పురపాలక సంఘ సంబంధిత విభాగం అధికారులకు, సిబ్బందికి రాతపూర్వకంగా తెలియజేసుకున్న పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికైనా పురపాలక శాఖ కమిషనర్ పట్టించుకోని వెంటనే సదరు ప్రాంతంలో ఉన్న హైమాస్ట్ లేట్లను సరిచేసి ఎదురవుతున్న ఇబ్బందులను లేకుండా చేస్తారని ఆశిద్దాం.