నిర్మల్ :(ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 5: బీజే ఎల్పీ నేత, నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ చౌక్ ఆడియో కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన బీజేపీ రైతు సత్యాగ్రహ ఆందోళన కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లను గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నేరవేర్చి ఎండుతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు తాను ఇవ్వలేదు సోనియా రాహుల్ గాంధీది ఇచ్చారంటూ బుకాయించడం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు తాను ఇవ్వలేదు సోనియా, రాహుల్ గాంధీ లే ఇచ్చారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజలను మభ్యపెడుతూ ముందుకు వెళ్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ కు ప్రజలు చరమగీతం పాడుతారన్న విషయాన్ని గుర్తించాలన్నారు.