ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ప్రపంచంలోనే అపరకుబేరుడిగా ఉన్న ఎలోన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. 9 నెలల కాలంలో తొలిసారి బ్లూమ్‌బెర్గ్ వరల్డ్ రిచెస్ట్ బిలియనీర్ జాబితాలో స్థానాన్ని కోల్పోయారు. టెస్లా కంపెనీ షేర్లు 7.2 శాతం కుప్పకూలిపోవడంతో బిలియనీర్ల స్థానంలో తొలిస్థానంలో ఉన్న మస్క్ రెండో స్థానానికి పడిపోయారు. యథావిధిగా అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్ 200 బిలియన్ డాలర్ల సంపదతో తొలిస్థానాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం మస్క్ నెట్‌వర్త్ 198 బిలియన్లుగా ఉంది.