Trending Now

Encounter: భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం

Encounter in Maharashtra-Chhattisgarh: మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఛత్తీస్ గఢ్- మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్ గఢ్ కాంకేర్, మహారష్ట్ర గడ్చిరోలి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భామరగడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతానికి సమీపంలో సీఆర్ఫీఎఫ్, సీ60కి చెందిన 22 యూనిట్లు కూంబింగ్ నిర్వహించాయి. ఈ సమయంలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా.. ఓ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆయనను హెలికాప్టర్‌లో నాగ్ పూర్ ఆస్పత్రికి తరలించారు.

Spread the love

Related News

Latest News