Trending Now

సూపర్-8లో అడుగుపెట్టడం బిగ్ రిలీఫ్ : టీమ్ ఇండియా కెప్టెన్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-8కు చేరుకోవడం బిగ్ రిలీఫ్ అని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. ‘న్యూయార్క్ పిచ్‌పై ఆడటం తేలికేమీ కాదు. ఇలాంటి పిచ్‌పైన 110+ స్కోరైనా ఛేదించడం కష్టమే. ఏ క్షణంలోనైనా ఫలితం తారుమారయ్యే ఛాన్స్ ఉంది. సూర్య, దూబే రాణించడంతో మ్యాచ్ గెలిచాం. లీగ్‌ దశలో మూడు మ్యాచుల్లో విజయం సాధించాం. దీంతో మరింత ఆత్మవిశ్వాసంతో సూపర్-8లో ఆడతాం’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కెప్టెన్‌గా రోహిత్ శర్మ మరో ఘనత..

ICC ఈవెంట్లలో భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ల జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానానికి చేరారు. ధోనీ 58 మ్యాచ్‌లలో 41 విజయాలతో అగ్రస్థానంలో ఉన్నారు. హిట్ మ్యాన్ 20 మ్యాచ్‌లలో 17 గెలుపులు, గంగూలీ 22 మ్యాచ్‌లలో 16 విజయాలతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. రోహిత్ సారథ్యంలో WTC ఫైనల్, ODI WC ఫైనల్, T20WC సెమీ ఫైనల్‌లో భారత్ ఓడింది. ఈసారి ఎలాగైనా కప్పు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Spread the love

Related News

Latest News