నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కూచాడి శ్రీ హరి రావు..
నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 18 : కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అన్ని వర్గాలకు సమ న్యాయం జరిగి సంక్షేమ బాట పడతారని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం నిర్వహించిన కాంగ్రెస్ లో చేరికల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలు భూ దందాలు, భూ అక్రమాలు తప్ప అర్హులైన వారి సంక్షేమం గురించి పట్టించుకోలేదని పేర్కొన్నారు. పదేళ్లలో తెలంగాణకు జరిగిన అన్యాయం 70 ఏళ్లలో జరగలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసీఆర్ అహంకార ధోరణి కారణంగానే గత శాసనసభ ఎన్నికలలో అన్ని వర్గాల వారు ఆయనకు చరమగీతం పాడారని చెప్పారు. నాలుగు నెలల ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసిన సత్తా ఎవరికీ లేదని చెప్పారు.
భవిష్యత్తులో మరిన్ని వినూత్నమైన సంక్షేమ పథకాలు కార్యక్రమాలతో రాష్ట్ర కాంగ్రెస్ అన్ని వర్గాలకు సమన్యాయం చేసే దిశగా ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశాన్ని ఏలే సత్తా సామర్థ్యాలు కూడా కాంగ్రెస్‌కు ఉన్నాయని.. ఇప్పటికే అనేక సర్వేలు స్పష్టంగా ప్రకటించాయని శ్రీహరి రావు ఈ సందర్భంగా తెలిపారు. అదిలాబాద్ ఎంపీ సీటును కాంగ్రెస్‌ను గెలిపించి ఇవ్వడమే మన పనిగా చేసుకుని పల్లె పల్లెనా.. వీధి వీధినా.. తలుపును తట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చి కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడం కోసం కష్టపడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా గ్రంథాలయాల చైర్మన్ ఎర్రవొత్తు రాజేందర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నిర్మల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, ప్రస్తుత దిలావర్ పూర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, ఎంపీపీ అక్షర అనిల్ కుమార్, మండల రైతు బంధు కో ఆర్డినేటర్ కె.రాజేశ్వర్, వైస్ ఎంపీపీ బాపురావు, కదిలి దేవస్థానం చైర్మన్ వెంకట్ రావు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు స్వామి గౌడ్, ఆర్. మహేష్ ,తిరుమల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ అమృత చిన్నరెడ్డి, న్యూ లోలం సర్పంచ్ ఒడ్నంసవిత కృష్ణ, దిలావర్ పూర్ గ్రామ అధ్యక్షులు డా. రవి, భుజంగా రావు, కదిలి మాజీ ఉప సర్పంచ్ మారుతి పటేల్, పిఎసిఎస్ డైరెక్టర్ దత్తురం పటేల్ సాంబాజీ పటేల్ నర్సారెడ్డి, మాజీ సర్పంచ్, ఎ.లక్ష్మణ్, సముందర్ పల్లి బీఆర్ఎస్ అధ్యక్షులు, ఆత్మ డైరెక్టర్ సప్పాల రవి లతోపాటు పలువురు పాల్గొన్నారు.