Trending Now

ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి..

ప్రతిపక్షం, హనుమకొండ ప్రతినిధి, మే 6: ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు ఓటు వేయాలని గాంధీ చారిటబుల్ ట్రస్ట్ వరంగల్ కోఆర్డినేటర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత పరికిపండ్ల వేణు అన్నారు. మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మే ఒకటో తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఓటు హక్కు వినియోగ చైతన్యంపై నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమం సోమవారం ఆదర్శ కాలనీలో ఓటరు అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదన్నారు. ఓటు.. మనిషి అస్తిత్వానికి ప్రతీక అని అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగం దేశంలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు మన భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు ఓటింగ్ రోజు నిర్లక్ష్యం వహించకుండా ఓటు హక్కును వినియోగించుకొని అభివృద్ధికి బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ కాలనీ అభివృద్ధి కమిటీ గౌరవ సలహాదారు ఇమ్మనేని సుందరావు, సూర్యకిరణ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు తూడి విద్యాసాగర్ రెడ్డి, గాంధీ ట్రస్ట్ సభ్యులు, కాలనీవాసులు పున్నం శ్రీను, సరోత్తంరెడ్డి, బాలునాయక్, శ్యాంసుందర్ రెడ్డి, జగదీశ్వర్, గోపాల్, వెంకట్ రెడ్డి, లడే శ్రీను, మోహన్ రెడ్డి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News