ప్రతిపక్షం, గజ్వేల్ మార్చి 30: నీళ్ళు అందక మళ్ళీ పంటలు ఎండిపోతున్నాయి, మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శామిర్ పేటలోని అరణ్య అతిథి గృహంలో జరిగిన గజ్వెల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేశవ రావుకు ఏమి అన్యాయం చేశాం..? 3 సార్లు రాజ్యసభ ఇచ్చాము. కుమార్తె కు మేయర్, కొడుక్కు ఛైర్మన్ పదవులు ఇచ్చాం. కేసీఆర్ ఎంతగా ప్రియరిటీ ఇచ్చారో తెలియదా..? కష్ట కాలంలో పార్టీని విడిచిపెట్టిన వాళ్లను కాళ్ళు మొక్కినా తిరిగి వాళ్ళను తీసుకొమన్నారు. కాంగ్రెస్ చేసిందేమీ లేదని..100 రోజుల్లో హామీలు నీటి బుడగలు. ఉద్దేర పథకాలు మొదలు పెట్టారు. ఆర్టీసీ, సివిల్ సప్లై దివాళా తీయడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, జడ్పీటిసి పంగ మల్లేశం, నాయకులు మాదాసు శ్రీనివాస్, శేఖర్ గౌడ్, కొట్టాల యాదగిరి, కార్యకర్తలు పాల్గొన్నారు.