Trending Now

నన్ను విమర్శించే అర్హత వారికి లేదు.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: నన్ను విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదని మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేను నిఖార్సయిన ఉద్యమకారుణ్ణి.. ఫైటర్‌ను.. ప్రజల కోసం ఎన్ని సార్లు అయిన జైల్ కి పోయే దమ్మున్న నాయకుణ్ణి అని తెలిపారు. నన్ను విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదని.. కోమటిరెడ్డి సోదరులకు బ్రోకర్లు అని పేరుందని ఆరోపించారు. జిల్లా రాజకీయాల్లో వెదవులు వీళ్ళు అని సంచలన కామెంట్స్ చేశారు. నల్గొండ జిల్లా అన్నదాతలను మోసం చేసి, సాగర్ నీళ్లను ఆంధ్రకు అమ్మి అప్పటి సీఎం YSRవద్ద ముడుపులు తీసుకున్న వెదవలు అని కోమటిరెడ్డి సోదరులపై ఆయన ఫైరయ్యారు. వీళ్ళు కేసీఆర్ పై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు.. జాగ్రత్త బిడ్డ లాగు విప్పి కొడతామన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని.. పదవుల కోసం రేవంత్ బూట్లు తుడువడానికి పోటీ పడుతున్నారని.. రేవంత్ సంక నాకుతూ పబ్బం గడుపుతున్నారన్నారు.

కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీకి ఓటెయ్యాలని చెప్పిన దగాకోర్ కోమటిరెడ్డి. ఆగ్రర్భ శ్రీమంతుల్లాగా బిల్డప్ ఇస్తున్నారు.. నా చరిత్ర ఏంటో, మీ చరిత్ర ఏంటో చర్చ పెడదామా..? నువ్వు పుట్టి పెరిగిన ఇళ్ళు, నేను పుట్టి పెరిగిన ఇళ్ళు చూస్తే అర్ధం అయితది ఎవడికి తినడానికి తిండి లేకుండెనో..? అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ ముమ్మాటికీ బీజేపీ మనిషే.. బీజేపీ లోకి పోతాడు అని కాంగ్రెస్ మంత్రులే లీక్ లు ఇస్తున్నారు.. కేసీఆర్ జోలికి వస్తే తన్ని తరిమేస్తాన్నారు.

Spread the love

Related News

Latest News