ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ కేసులో ఈనెల 20 వరకు కస్టడీని పొడిగిస్తూ తీర్పునిచ్చింది. మరోవైపు ఈడీ దాఖలు చేసిన 8 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈనెల 20న విచారణ చేపడతామని జడ్జి చెప్పారు. కాగా ఇప్పటికే CBI కేసులో కవితకు కోర్టు ఈనెల 20 వరకు కస్టడీ విధించిన విషయం తెలిసిందే. సోమవారమే దీనిపై విచారణ జరగాల్సి ఉండగా, అనివార్య కారణాలతో నేటికి వాయిదా పడింది. ఈనెల 10న 200 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన ED.. అందులో చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ఉద్యోగులు దామోదర్, ప్రిన్స్, చన్‌ప్రీత్‌తో పాటు అర్వింద్‌సింగ్ అనే వ్యక్తిని నిందితులుగా చేర్చింది.