ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పై ప్రముఖ ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి పోటీ చేయనున్నారు. గతంలో తమన్నా మంగళగిరి నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. భారత చైతన్య యువజన పార్టీ నుంచి ఆమె బరిలో ఉండనున్నట్లు ఆ పార్టీ చీఫ్ రామచంద్రయాదవ్ ప్రకటించారు. చట్టసభల్లో ట్రాన్స్ జెండర్స్ కు అవకాశం కల్పించాలని తమన్నా సింహాద్రికి టికెట్ కేటాయించినట్లు స్పష్టం చేశారు.