ప్రతిపక్షం, సిద్దిపేట: తమ పంట పొలాలకు సాగునీరు అందించి ఎండిపోయే పంటలను కాపాడాలని రైతులు రోడ్డెక్కారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం రాంపూర్ చౌరస్తా వద్ద అక్కెనపల్లి, ఘనపూర్ గ్రామాలకు చెందిన సుమారు వంద మంది రైతులు హన్మకొండ – సిద్దిపేట రహదారి పై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేయాలని రైతులు తెలిపారు. తక్షణమే తమ గ్రామాలకు కాలువల ద్వారా సాగునీతిని అందించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక రాజగోపాల్ పేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చచెప్పి ఆందోళన విరమింప చేశారు.