ప్రతిపక్షం, రాజన్న సిరిసిల్ల జిల్లా, మే 17 : వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని వేములవాడ అర్బన్ మండలం అనుపురం ప్రధాన రహదారిపై రైతన్నలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మ్యాచర్ వచ్చి 15 రోజులు గడుస్తున్న ఇప్పటికీ లారీలు రావట్లేదని, వెంటనే సంబంధిత అధికారులు లారీలను పంపించాలని కోరారు.
అకాల వర్షం వల్ల ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట వర్షంతో తడిసి ముద్దయిపోతుందని వెంటనే త్వరితగతిన కొనుగోలు చేపట్టాలని రైతు డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ వీరప్రసాద్ రైతులతో మాట్లాడి.. సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్తామడంతో రైతులు ధర్నా విరమించారు. అనంతరం అనుపురం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన డీసీఓ పది రోజుల్లో ధాన్యాన్ని పూర్తిగా తరలిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.