ప్రతిపక్షం, నేషనల్: రైతుల ఆందోళనలో విషాదం చోటుచేసుకుంది. హర్యానాలోని ఖనౌరి సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతు ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య బుధవారం సాయంత్ర ఘర్షణ చోటుచేసుకోగా, ఒక రైతు మృతి చెందాడు. తాజా ఘటనతో రెండ్రోజుల పాటు ‘ఢిల్లీ మార్చ్’ను రద్దు చేస్తున్నట్టు ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రకటించింది.