ఘోర ప్రమాదం.. 20 మంది మృతి


చేవెళ్ల వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్​
సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు
క్షతగారతులను ఆసుపత్రికి తరలింపు
మరికొందరి పరిస్థతి విషమం

సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశం

ప్రతిపక్షం, రంగారెడ్డి జిల్లా, నవంబర్​3: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద సోమవారం తెల్లవారుజామున చేవెళ్ల ఆర్టీసీ డిపో బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొనడంతో 20 మంది మృచెందినట్లు సమాచారం. వేగంగా వచ్చి ఢీకొట్టిన టిప్పర్ బస్సులోకి దూసుకెళ్ళింది. ఈ సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో ప్రయాణీకులు సీట్లలోనే ఇరుక్కుపోయారు. టిప్పర్ వేగంగా ఢీకొనడంతో బస్సు ముందు వరుస ఐదు వరుసల సీట్లు నుజ్జునుజ్జు అయ్యాయి. కంకర రాళ్లతో బస్సు నిండిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎంత మంది చనిపోయారనేది తెలియాల్సి ఉంది. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కంకర వల్లే ప్రమాద తీవ్రత పెగినట్లు తెలుస్తోంది.

సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్​ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం ఆదేశించారు. బస్సు ప్రమాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్​కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సీఎస్​, డీజీపీలను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకోవాలని సీఎం వారితో మాట్లాడారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు.

Spread the love

Related News