Hero Nithiin Blessed with Baby Boy: టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ తండ్రి అయ్యాడు. శుక్రవారం ఆయన భార్య షాలిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హీరో నితిన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘వెల్కమ్ ద న్యూ స్టార్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ’ అంటూ ఓ ఫొటో పంచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.
కాగా, నితిన్ 2020 జులైలో షాలినిని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం తమ్ముడు మూవీలో నితిన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. దీంతోపాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాబిన్ హుడ్’ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయనున్నారు.