ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 6 : ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రైవేట్ పాఠశాలలపై తగిన విధంగా దృష్టి పెట్టి ముందుకెళ్లాలని కోరుతూ అంబేద్కర్ జిల్లా యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బత్తుల రంజిత్ కుమార్ మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలోజరుగుతున్న అక్రమ దోపిడీని నివారించేలా కఠినమైన రీతిలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు పాఠ్య పాఠ్య పుస్తకాలు ,నోటు పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ ,ఇతర వినియోగ సామాగ్రి స్థానికంగా విక్రయించకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలలలో అధిక ఫీజుల వసూలు పై దృష్టి పెట్టి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు పరిసర మండలాలలో ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా కొనసాగుతున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని లేనియెడల తమ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు.
ప్రభుత్వ విద్య సంస్థలలో కూడా తగిన విధంగా నిత్య పర్యవేక్షణ చేపట్టి ప్రభుత్వ ఆదేశాలను విద్యాశాఖ సూచనలకు అనుగుణంగా విద్యాబోధనలు జరిగేలా చూడాలన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలలో కొనసాగుతున్న దళారీ వ్యవస్థను కూడా నివారించేలా కఠినమైన రీతిలో చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా విద్యాధికారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బత్తుల రంజిత్ కుమార్,ఉపాధ్యక్షుడు దామ భూమేష్, బొడ్డు నరేష్, పట్టణ అధ్యక్షులు కత్తి నవీన్, ప్రధాన కార్యదర్శి లింగయ్య, మామిడ మండల అధ్యక్షుడు రత్నాయ్య తదితరులు పాల్గొన్నారు.