Trending Now

Heavy Rains: విజయవాడలో భీకర భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు!

భారీ వర్షాలు, వరదలు విజయవాడలో భీకర పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. మరోవైపు, మొగల్ రాజపురంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. మరో ఇద్దరి కోసం అక్కడ రిస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల అయితే రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి.

విద్యాధరపురం, ఆర్‌ఆర్‌ నగర్‌లో రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరింది. వరద నీరుతో రామవరప్పాడు రింగ్‌రోడ్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. నిడమానూరు వరకు వాహనాలు నిలిచిపోయాయి. బెంజిసర్కిల్‌ ఫ్లైఓవర్‌ కిందకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది.

Spread the love

Related News

Latest News