ప్రతిపక్షం, వెబ్ డెస్క్: రంగారెడ్డి – మైలార్దేవ్పల్లి పరిధిలో కాటేదాన్ పారిశ్రామిక వాడలో పహల్ ఫుడ్ బిస్కెట్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మెషినరీ, బిస్కెట్ తయారీ ముడి సరుకు పూర్తిగా మంటల్లో కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. అయితే అగ్రి ప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఎనిమిది ఫైర్ ఇంజన్లతో సిబ్బంది ప్రయత్నిస్తున్నా 6 గంటలుగా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. దీంతో భవనం పిల్లర్లు కుంగిపోతున్నాయి. మంటల ధాటికి ఇప్పటికే ఓ ఫ్లోర్ కూలిపోగా.. భవనం మొత్తం కూలిపోయే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.