ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 20 : భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడు అత్యంత బాధ్యతగా నిర్వహించుకునే అగ్నిమాపక దళ శాఖ వారి వారోత్సవాలు శనివారం ముగిశాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కార్యాలయంలో ముగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారం రోజులపాటు నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు.. జరగక ముందు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, విషయాల పట్ల ప్రజలకు అగ్నిమాపక దళాధిపతి జయత్ రాం పలు కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రధాన కూడలతో పాటు జన ఆవాసాలు, మురికివాడాలు పారిశ్రామిక ప్రాంతాలలో ప్రజలకు ఆకట్టుకునేలా విన్యాసాలు తదితర వాటిని చేపట్టారు. లీడింగ్ ఫైర్ మెన్ లు, అశోక్, శ్రీనివాస్, డ్రైవర్ ఆపరేటర్లు హుస్సేన్ షా, రవి, ఫైర్ మెన్ లు నవీన్ కుమార్ రెడ్డి అజయ్ కుమార్, అరుణ్ కుమార్, రాజు నగేష్ తదితరులు పాల్గొన్నారు.